* ప్రాథమిక హక్కులు కాపాడేందుకే కోర్టులు
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్
ఆకేరు న్యూస్, డెస్క్ : రాజ్యాంగంతోనే రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తెలిపారు. పౌరుల ప్రాథమిక హక్కులను కోర్టులు కాపాడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సీకే కన్వెన్షన్లో ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ ఇన్స్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ అంశంపై ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడే అవకాశం తనకు రావడం చాలా గొప్ప విషయమన్నారు. తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి .. తన న్యాయవాద ప్రస్థానం అమరావతి నుండే ప్రారంభించానని గుర్తు చేశారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని.. దీంతోనే ఓ ఛాయ్ వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో నిఫుణులను అందించే సత్తా భారత్కు వస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందన్నారు. దేశంలో యువశక్తికి కొదవలేదన్నారు. ప్రతి రంగంలోనూ మన భారతీయుల ముద్ర ఉంటుందని కొనియాడారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
……………………………………………….
