* జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల
* ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో తొలిసారి ఎన్నికలు
* 3 దశల్లో ఎన్నికలు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. శుక్రవారం మధ్యాహ్నం భారత ఎన్నికల కమిషన్ (Election Commission) మీడియా సమావేశం నిర్వహించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ (Rajeev Kumar) వివరాలు వెల్లడించారు. హర్యానా (Haryana), జమ్మూ కశ్మీర్లో (Jammu And Kashmir) అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. జమ్మూ కశ్మీర్లో మూడు దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. జమ్ముకశ్మీర్‌తో పాటు హర్యానా ఎన్నికలు అక్టోబర్ 1న, ఫలితాలు 4న రానున్నాయి. జమ్ముకశ్మీర్‌లో 87 స్థానాలకు, హరియాణలో 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయని రాజీవ్ వెల్లడించారు.
పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో..
జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 26 స్థానాలకు, మూడో విడతలో 40 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించనున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajeev Kumar) తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో మొత్తం 87 లక్షల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. వారి కోసం 11 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 71లక్షల మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు సీఈసీ చెప్పారు.
తొలిదశ
నోటిఫికేషన్ విడుదల తేదీ : ఆగస్టు 20
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: ఆగస్టు 27
నామినేషన్ల పరిశీలన: ఆగస్టు 28
నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఆగస్టు 30
పోలింగ్ తేదీ: సెప్టెంబర్ 18
రెండో దశ
నోటిఫికేషన్ విడుదల తేదీ : ఆగస్టు 29
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: సెప్టెంబర్ 05
నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 06
నామినేషన్ల ఉపసంహరణ గడువు: సెప్టెంబర్ 09
పోలింగ్ తేదీ: సెప్టెంబర్ 25
మూడో దశ
నోటిఫికేషన్ విడుదల తేదీ : సెప్టెంబర్ 05
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: సెప్టెంబర్ 12
నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ గడువు: సెప్టెంబర్ 17
పోలింగ్ తేదీ: అక్టోబర్ 01
ఎన్నికల ఫలితాల తేదీ: అక్టోబర్ 04
హర్యానా ఎన్నికలు
జమ్ముకశ్మీర్‌లో మూడో విడత పోలింగ్ రోజే హరియాణా శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 90 స్థానాలకు అక్టోబర్ ఒకటిన ఓటింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. వాటిలో 73 జనరల్ స్థానాలు కాగా 17 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రెండు కోట్లకుపైగా ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. 4.52 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
నోటిఫికేషన్ విడుదల తేదీ : సెప్టెంబర్ 05
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: సెప్టెంబర్ 12
నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ గడువు: సెప్టెంబర్ 16
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: అక్టోబర్ 01
ఎన్నికల ఫలితాల తేదీ: అక్టోబర్ 04
——————————-