
* పౌరులకు అవగాహన కల్పించిన పోలీసులు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరిగింది. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. దేశవ్యాప్తంగా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి. దాదాపు 50 సంవత్సరాల తర్వాత వార్ సైరన్ (WAR SIRUN) మోగింది. సరిగ్గా 4 గంటల నుంచి 4:30 వరకు మాక్ డ్రిల్ సాగింది. ముందుగా పోలీస్ సైరన్, ఇండస్ట్రియల్ సైరన్ మోగాయి.. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ తోపాటు.. అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ (MOCK DRILL) జరిగాయి. సికింద్రాబాద్(SECUNDARABAD), గోల్కొండ, కంచన్‌బాగ్ DRDA, మౌలాలిలోని NFCలో డిఫెన్స్ బృందాలు మాక్‌డ్రిల్ నిర్వహించాయి. అంతేకాకుండా, కూడళ్లలో సైరన్లను మోగించి పోలీసులు పౌరులకు అవగాహన కలిగించారు. విశాఖ(VISAKHA)లోని కొత్త జాలరు పేట, ఆక్సిజన్ టవర్స్ దగ్గర మాక్ డ్రిల్ నిర్వహించారు.
………………………………………………….