* బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్..
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓయూలో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడని, నిరుద్యోగ భృతి సంగతి ఏమైందని బీఆర్ఎస్వీ నాయకులు నిలదీయడంతో పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..? అని బీఆర్ఎస్వీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్‌లతో ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
………………………………