
* వారివల్ల జర్నలిజం వ్యవస్థకే చెడ్డ పేరొస్తోంది
* సమాజ మార్పుణకు కృషి చేసే యూట్యూబ్ ఛానళ్లను ప్రోత్సహించండి
* కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఆకేరున్యూస్, కరీంనగర్: జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో ఇష్టానుసారం వ్యక్తిగత దూషణలు చేస్తూ కుటుంబాలపై బురద చల్లుతూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీరివల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్ నిర్వాహకులు కూడా ఈ విషయంలో కఠినంగా ఉండాలని కోరారు. అదే సమయంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేసే యూట్యూబ్ ఛానళ్లను కచ్చితంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయేనని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ఇండ్లు నిర్మించడంతోపాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు సమాజంలో జర్నలిస్టులు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటా, వేములవాడకు విచ్చేసిన కేంద్ర మంత్రి స్థానిక ప్రెస్ క్లబ్ (ఐజేయూ) ను సందర్శించారు. ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి గతంలో రూ.10 లక్షల మేరకు ఎంపీ లాడ్స్ నిధులను మంజూరు చేశారు. ఆ నిధులతోపాటు దాతల సాయంతో నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బండి సంజయ్ ను గజమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ,నేను ఈరోజు ఈస్థాయికి వచ్చానంటే మీడియా సహకారమే కారణం. ప్రజల కోసం తాను చేసిన ఉద్యమాలను, కార్యక్రమాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంవల్లనే నాకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. మీడియా సహకారం లేకపోతే కరీంనగర్ కే పరిమితమయ్యేవాడిని. గత ఐదేళ్లలో బీజేపీ అనేక ఉద్యమాలు చేసిందన్నారు. ఏ ఉద్యమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా కాంగ్రెస్ కు అధికారం లభించడంతో ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. గత 17 నెలలుగా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ప్రజల పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్లయింది. జర్నలిస్టుల జీవితాలు కూడా దుర్బరంగా మారాయి. హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు కలగానే మారాయి. ఇటీవల కాలంలో యూట్యూబ్ ముసుగులో జర్నలిజం అనుభవం లేని జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో ఇష్టానుసారం వ్యక్తిగత దూషణలు చేస్తూ కుటుంబాలపై బురద చల్లుతూ బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నారు.
వేములవాడ ఆలయ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను..
వేములవాడ ఆలయ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని.. ఈ ఏడాది కచ్చితంగా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఈ విషయంలో మొండిపట్టుదలతో ఉన్నా. అంతేగాకుండా కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి కోసం అహర్నిశలు క్రుషి చేస్తా. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రూ.5 లక్షల చొప్పున ఉపాధి హామీలిచ్చాను. సీఎస్సార్ ఫండ్స్ కింద వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన. అయినా కొందరు కావాలని కరీంనగర్‌కు బండి సంజయ్ నయాపైసా కూడా తేలేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
……………………………………………………