* క్యూ ఆర్ కోడ్ తో శాలువా
* ఫోన్ లో స్కాన్ చేస్తే మోదీ ఘనత
* సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ఆవిష్కరణ
ఆకేరు న్యూస్, డెస్క్ : సిరిసిల్ల నేత కార్మికులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అగ్గిపెట్టెలో ఇమిడే చిరను నేసి రికార్డుల్లో నిలిచారు. చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మరో ఘనత సాధించాడు. శాలువాపై విజయ్ వేసిన క్యూఆర్ కోడ్ ను ఫోన్లో స్కాన్ చేయగానే ప్రధాని మోదీ చేపట్టిన పనులు.. పథకాలు.. దేశ ప్రగతిని.. తెలిపే ఫొటోలు, వీడియోలు ప్రత్యక్షమవుతాయి. “మోడీ మన నాడీ” అనే నినాదంతో పాటు క్యూఆర్ కోడ్ను ముద్రించి, కార్మికుల ప్రాధాన్యతను చాటి చెప్పాడు. 1990లో విజయ్ కుమార్ తండ్రి పరంధాములు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను ఆవిష్కరించాడు.మగ్గంపై 12 రోజులు శ్రమించి శాలువాను తయారు చేశారు. 32 ఇంచుల వెడల్పు..రెండున్నర మీటర్ల పొడువు ఉంటుంది. దబ్బనంలో దూరె చీర..ఉంగరంలో దూరె చీర..ఊసరవెళ్లిలాగా రంగులు మార్చే చీర..చందనాలు వెదజల్లే..పరిమళించే పట్టుచీరలను మగ్గంపై నేచాడు. తాజాగా క్యూ ఆర్ కోడ్ను బట్టలపై ఆవిష్కరించి మరో అద్భుతానికి ఆద్యుడయ్యాడు.
………………………………………….
