* దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్ర
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో 2030 నాటికి 2 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka )అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ను ఆయన సందర్శించారు. ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్కషాప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్ర అన్నారు. ఫ్లోటింగ్ సోలార్ పై పెట్టుబడులు పెడతామన్నారు. ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటీ హైదరాబాద్‌తో (IIT Hyderabad)సింగరేణి ఒప్పందం చేసుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక దేవాలయాలు అయిన ఐఐటీలకి అంకురార్పణ చేశారని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువని అన్నారు.
…………………………….