* సంభల్ గుడి బావిలో దొరికిన మూడు విగ్రహాలు
ఆకేరున్యూస్, సంభల్: యూపీలోని సంభల్లో ఉన్న భస్మ శంకర్ ఆలయంలోని భావిలో మూడు విగ్రహాలను గుర్తించారు. 1978 నుంచి ఆ గుడి మూసి ఉండగా.. సుమారు 46 ఏళ్ల తర్వాత ఆ ఆలయాన్ని తెరిచారు. తాజాగా ఆలయం వద్ద ఉన్న బావిని కూడా రీఓపెన్ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా తెలిపారు. అలాగే ఆలయానికి ప్రాచీన కళను తీసుకువస్తామని సంజీవ్ శర్మ అనే వ్యక్తి తెలిపాడు. ఇటీవల హింస చోటుచేసుకున్న షాహి జామా మసీదుకు కిలోమీటర్ల దూరంలో భస్మ శంకర్ ఆలయం ఉందని.. బావిలో సుమారు 20 ఫీట్ల లోతులో పార్వతి విగ్రహాన్ని గుర్తించినట్లు సతేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. గుడి, గుడిలో బావిపై కార్బన్ డేటింగ్ నిర్వహించాలని హిందువులు కోరుతున్నారు.
………………………………..