
* 42కు చేరిన మృతుల సంఖ్య..?
* శిథిలాలను తొలగిస్తున్న అధికారులు
* శిథిలాల కింద మరిన్ని మృత దేహాలు ఉండే అవకాశం
* కొనసాగుతున్న సహాయక చర్యలు
*పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య
ఆకేరు న్యూస్, పటాన్ చెరు : పటాన్ చెరులోని పాశమైలారం ఘటనలె మృతుల సంఖ్య 42 కు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్తున్నారు. మృతుల్లో ప్టాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు తీవ్రంగా గాయపడ్డ 33 మంది కార్మికులకు చికిత్స అందిస్తున్నారు. బిల్డింగ్ శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. శిథిలాలను తొలగించే పనిలో అధికారులు ఉన్నారు.మృత దేహాలను గుర్తించేందుకు డీఎన్ ఎ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిషా.బిహార్,ఝార్ఖండ్, తమిళనాడుకు చెందిన కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.
కంట్రోల్ ఏర్పాటు
పేలుడు ఘటనలో ప్రమాదానికి గురైన బాధితుల కోసం సంగారెడ్డి కలెక్టరేట్ లో
ప్రత్యేక కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు. బాదితుల వివరాల కోసం కంట్రోల్ రూంలో
సంప్రదించాలని అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (JAGGAREDDY) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన చాలా విచాకరమని, ఇటువంటి పరస్థితుల్లో రాజకీయ విమర్శలు అర్ధరహితమని తెలిపారు.
పాశమైలారనికి సీఎం రేవంత్
సీఎం రేవంత్ నేడు పాశమైలారం లో పర్యటించనున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన
అనంతరం చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శిస్తారు. ఇప్పటికే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
………………………………………………………..