
* పుష్కర స్నానాలకు తరలివస్తున్న భక్తులు
ఆకేరున్యూస్, కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రం సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. రెండవ రోజు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సరస్వతీ నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. ఉదయం నుండే కాలేశ్వరం క్షేత్రానికి చేరుకున్న భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో జ్యోతులను వెలిగించి నది అమ్మ ఒడిలో తమను చల్లగా కాపాడాలంటూ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మ్రొక్కులను చెల్లించుకుంటున్నారు భక్తుల రాకతో ఆధ్యాత్మిక చైతన్యం అనిపించింది. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగానివ్వద్దు
కలెక్టర్ రాహుల్ శర్మ
సరస్వతి పుష్కరాలు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశించారు. రెండవ రోజు కాలేశ్వరం జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వస్తున్న భక్తులను సౌకర్యాల గురించి అడిగి రాసుకున్నారు. కాళేశ్వర క్షేత్రంలో ఏర్పాటుచేసిన స్టాళ్లు, టెంట్ సిటీ సరస్వతి ఘాట్, షవర్లు, మరుగుదొడ్లు, పనితీరులను పరిశీలించారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలు తయారుచేసిన హ్యాండ్ మేడ్ వస్తువుల స్టాళ్లు పరిశీలించి వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు. త్రివేణి సంగమం వద్ద భక్తులకు మంచినీటి సరఫరాకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈకి ఆదేశించారు. పుణ్య స్థానాలకు వస్తున్న భక్తులను పలకరించిన కలెక్టర్ భక్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకోగా భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని, నదిలో పిండ ప్రధాన కార్యక్రమాలకు కేటాయించిన చోటులోనే పిండ ప్రదానాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వ్యర్థాలను గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లోనే చేయాలని త్రివేణి సంఘంలో వేయవద్దని భక్తులు నది పవిత్రతను కాపాడాలని కోరారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సరస్వతి గట్టు వద్ద ఏర్పాటుచేసిన సెల్ఫీ స్టాల్ లో భక్తులతో ఫోటో దిగారు.
భక్తులకు సేవలు అందిస్తున్న 108
సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులకు ఏవైనా ఇబ్బందులు జరుగుతే వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నారు. 108 బై క్ అంబులెన్స్ సైతం భక్తులకు ఇలాంటి ఇబ్బందులు జరిగిన తక్షణ మె స్పందించి చికిత్స అందిస్తున్నారు.
స్టాళ్ల ప్రారంభోత్సవం
జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖైదీలు తయారుచేసిన హ్యాండ్ మేడ్ వస్తువుల స్టాళ్లను జైల్ల శాఖ డిఐజి సౌమ్య మిశ్రా తో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాపారస్తులను పలకరిస్తూ వ్యాపారాలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
……………………………………………