
* వివాహ బంధంతో ఒక్కటైన అఖిల్, జైనాబ్
* వేడుకకు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : అక్కినేని నాగార్జున, అమలల ముద్దుల తనయుడు అఖిల్ (Akhil) శుక్రవారం ఓ ఇంటి వాడయ్యాడు. తెల్లవారుజామున అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన వేడుకలో అఖిల్, జైనాబ్ రవ్దీ (Zainab Ravdjee)లు మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి చెందిన ఫొటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, రానా, ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జూన్ 8వ తేదీన పెళ్లి రిసెప్షన్ జరగనుంది. కాగా అఖిల్, జైనాబ్ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గత నవంబర్లో రిసెప్సన్ జరిగింది. థియేటర్ ఆర్టిస్ట్, పెయింటర్ అయిప జైనాబ్ రావుద్జీ పుట్టింది హైదరాబాద్లోనైనా ముంబై, ఢిల్లీలో ఎక్కువగా పెరిగారు. జుల్ఫీ రావుద్జీ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్. వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు.
………………………………………………