* సాంబారులో విషం కలిపి హత్య
ఆకేరు న్యూస్,డెస్క్ ః తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన కథనం ప్రకారం తమిళనాడులోని ధర్మపురి జిల్లా కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ (35) ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రసూల్ కు భార్మ అమ్ముబీతో పాటు ఇద్దరు సంతానం. ఓ కుమారుడు ఓ కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వాంతులు చేసుకొని స్పృహతప్పి కోల్పోయిన రసూల్‌ను వారి కుటుంబసభ్యులు సేలంలోని ఓఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రసూల్ ఇటీవల ఆస్పత్రిలో మృతి చెందాడు. రసూల్ ఫుడ్ పాయిజన్ వల్లే మృతి చెందినట్లుగా డాక్టర్లు అనుమానించి రసూల్ రక్తనమూనాలను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయించారు. ల్యాబ్ పరీక్షలో రసూల్ విషం తినడం వల్ల మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. దీంతో రసూల్ కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి అమ్ముబీ సెల్ పోన్ తీసుకొని పరీక్షించగా ఆమె ఓ వ్యక్తితో చాట్ చేసినట్టుగా ఉంది. నీవు ఇచ్చిన విషం సాంబార్ లో కలిపి ఇచ్చాను అని ఆమె ప్రియుడికి ఇచ్చిన మెసేజ్ లో ఉంది. దీంతో రసూల్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రసూల్ భార్య అమ్ముబీని ఆమె ప్రియుడు లోకేశ్వర్ ను శనివారం అరెస్ట్ చేశారు.
……………………………….