
దేవాదుల ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీ రెడ్డి .
*మంత్రి ఉత్తమ్ కు కడియం, యశస్వినీరెడ్డి విజ్ఞప్తి
ఆకేరున్యూస్, హైదరాబాద్ : దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 3వ దశ ,6వ ప్యాకేజీలో సవరించిన పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (UTTAM KUMAR REDDY) )కీ స్టేషన్ ఘన్పూర్ (STATION GHANPUR) ఎమ్మెల్యే కడియం శ్రీహరి (KADIYAM SRIHARI) విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ ( MAMIDALA YASHASWINI REDDY)రెడ్డితో కలిసి సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం దేవాదుల (DEVADULA PROJECT)3వ దశ 6వ ప్యాకేజీ ద్వారా చేపట్టే పనుల వలన స్టేషన్ ఘనపూర్, వర్దన్నపేట, పాలకుర్తి, తుంగతుర్తి నియోజకవర్గాలలో దాదాపు 78వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉందని మంత్రికి వివరించారు. పనులలో జాప్యం జరగడంతో ఈ ప్రాంతాలకు సాగు నీరు అందడం లేదని మంత్రికి కడియం తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్ట్ గా దేవాదుల ప్రాజెక్టును గుర్తించి 6వ ప్యాకేజీ పనులను తక్షిణమే పూర్తి చేయాలనీ మంత్రిని కడియం శ్రీహరి కోరారు. ఉప్పుగల్ రిజర్వాయర్ నుంచి ప్రారంభమయ్యే ఈ పనులు దంస చెరువును, జఫర్ గడ్ పెద్ద చెరువును నింపడంతో పాటు జఫర్ గడ్ మండలంలో 10వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉందని కడియంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి తెలిపారు. జఫర్ గడ్( ZAFAR GADH) తో పాటు పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు 40వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. వీటితో పాటు నెల్లుట్ల చెక్ డ్యామ్, లోతు వాగుపైన ఆనకట్ట, ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ లో పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు పామునూరు దగ్గర బంజరు మాటు, ఆకేరు వాగు పైన కొనాయిచలం, తిడుగు గ్రామాల వద్ద చెక్ డ్యామ్ ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని మంత్రిని ఇద్దరు ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి యశస్విని రెడ్డి మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.