* తుది దశకు చేరుకున్న మిస్ వరల్డ్ పోటీలు
* హైటెక్స్ లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
* 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం
* భారత్ గెలిస్తే రికార్ఢ్ బ్రేకే…
ఆకేరు న్యూస్. హైదరాబాద్ మే 31: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరబడనుంది. 2025 సంవత్సరానికి గాను ప్రపంచసుందరి ఎవరో నేడు తేలనుంది..మిస్ వరల్డ్ పోటీలు తుది అంకానికి చేరుకుంది.. హైదరాబాద్‌లోని హైటెక్స్ మిస్ వరల్డ్ పోటీల ఫైనల్స్‌కు అంగరంగ వైభవంగా సిద్ధమెంది. దాదాపు 150 దేశాలు ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించనున్నాయి…106 దేశాల సుందరీమణులు పాల్గొన్న ఈ పోటీల్లో వివిధ దశలు దాటిన తరువాత ఫైనల్ పోటీలకు 8 మందిని ఎంపిక చేస్తారు. జ్యూరీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చే సమాధానం అధారంగా ఒక్కో విభాగం నుంచి ఒకరు ఎంపిక అవుతారు. వీరిలో ఒకరు ప్రపంచ సుందరి కాగా మిగతా ముగ్గురు రన్నర్ అప్ లుగా నిలుస్తారు…
సోనూ సూద్ కు అరుదైన అవకాశం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు అరుదైన అవకాశం లభించింది.. మిస్ వరల్డ్ పోటీల్లో న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు.మొత్తం నలుగురు న్యాయనిర్జ్ఞేతలుగా వ్యవహరించే ఈ పోటీ్లో సోనూ సూద్ తో పాటు మెఘా ఇంజినీరింగ్ డైరెక్టర్ సుధారెడ్డి,మిస్ ఇంగ్లండ్ 2014 విజేత కెరీనా టురెల్, మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్ జూలియా మోర్లీ ఉన్నారు.
ఇండియా గెలిస్తే రికార్డు బ్రేకే…
ఈ సారి ఈ పోటీ్లో ఇండియాకు చెందిన నందిని గుప్తా గెలిస్తే రికార్డు బ్రేక్ చేసినట్లే.. 1951లో ప్రారంభమైన ఈ పోటీ్లో భారత్ తో పాటు వెనుజులా దేశం మొత్తం ఆరు సార్లు మిస్ వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి.. ఈ భారత్ గెలిస్తే ఏడో సారి కిరీటం దక్కించుకున్నట్ల అవుతుంది..గతంలో
1966లో రీటీ ఫారియా.. 1994లో ఐశ్వర్యా రాయ్.. 1997 లో డయానా హైడెన్ ..1999లో యుక్తా ముఖి..2000లో ప్రియాంకా చోప్రా…2017 లో మానుషి చిల్లర్ లు ఈ కిరీటాన్ని స్వంతం చేసుకున్నారు… ఈ సారి ఇండియాకు కిరీటం దక్కితే అత్యధిక టైటిల్లు గెలిచిన దేశంగా నిలుస్తుంది…
గెలిచిన వారికి కాసుల పంటే…
మిస్ వరల్డ్ పోటీ్లో నెగ్గిన భామకు కనక వర్షం కురిసినట్లే… 8.5 కోట్ల నగదు తో పాటు 1,770 వజ్రాలతో కూడిన కిరీటాన్ని బహుకరిస్తారు.. ఇక ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ పర్యటకు అనుమతి ఉంటుంది.. ఇక వ్యాపార ప్రకటనలు .. సినిమాల్లో అవకాశాలు.. ఇలా ఎన్నో అవకాశలు ఆ అందాల భామను వరించనున్నాయి…
…………………………………………………………….
