
* గుండె పోటుతో డైరెక్టర్ రవికుమార్ హఠాత్మరణం
* టాలీవుడ్ లో విషాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టాలీవుడ్ లో విషాదం నెలకొంది యువ దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ గుండెపోటుతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగలవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. దర్శకుడిగా రవికుమార్ తనదైన శైలిలో సినిమాలు తీసి అందరి మన్ననలు పొందారు. బాలకృష్ణతో వీరభద్ర, గో పీచంద్తో యజ్ఞం,నితిన్ తో ఆటాడిస్తా,సాయి ధరమ్ తేజ్ తో పిల్లా నువ్వు లేని జివితం రాజ్ తరుణ్‌తో తిరగబడరా స్వామి చిత్రాలకు రవికుమార్ దర్శకత్వం వహించారు తిరగబడరా సామి ఆయన చివరి చిత్రం.. ఏ ఎస్ రవికుమార్ మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం అలుముకుంది.. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………..