
* గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీలో అసంతృప్తి నేతలు చాలామంది ఉన్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానానికి భయపడి ఉంటున్నారని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదించిన తరువాత తాను ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాని రాజాసింగ్ అన్నారు. పార్టీలో మాట్లాడే స్వేచ్ఛలేదని అన్నారు. పదవులు పోతాయన్న భయంతో పార్టీలో అవమానాలను భరిస్తూ కొనసాగుతున్నారని రాజాసింగ్ అన్నారు. ఒకప్పుడు లసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా పార్టీ అధిష్టానం నుండి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తాను ఏదైనా మాట్లాడగలనని రాజాసింగ్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా ఇద్దరు ముగ్గురు నేతలు పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణలో మార్వాడీలు నిజాం కంటే ముందు నుంచే ఉన్నారని రాజాసింగ్ తెలిపారు. మార్వాడీలు తెలంగాణ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు.
………………………………………