
* ఐఈఏ వంటి సంస్థల నిఘా అవసరం
* మనం దాడి చేసిన తీరును శత్రువు ఎప్పటికీ మరువడు
* ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనికులకు సెల్యూట్
* కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఆకేరు న్యూస్, డెస్క్ : పాక్ లాంటి బాధ్యతారహిత్య దేశం అణ్వాయుధాలపై అనుమానాలు ఉన్నాయని, ఆ అణ్వాయుధాలపై ఐఈఏ వంటి అంతర్జాతీయ సంస్థల నిఘా అవసరమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnathsingh) అన్నారు. ఉగ్రదాడులను దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని గుర్తు చేశారు. మనం దాడి చేసిన తీరును శత్రువు ఎప్పటికీ మరువడన్నారు. జమ్ముకశ్మీర్ శ్రీనగర్(Srinagar)లో ఆయన ఈరోజు పర్యటించారు. శ్రీనగర్‌లోని సైనిక బలగాలతో ముచ్చటించారు. అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనికులకు సెల్యూట్ చేశారు. దేశమంతా మిమ్మల్ని చూసి గర్వపడుతోందన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న అని అభిలాషించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించామన్నారు. పహల్గాం దాడి ద్వారా ఉగ్రవాదులు దేశ ప్రజలను విడదీయాలని చూశారని, శత్రుస్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశామన్నారు. పాకిస్థాన్ (Pakisthan) తరచూ అణు దాడి బెదిరింపులకు పాల్పడుతోందని, ఆ బెదిరింపులకు దేశం తలవంచేది లేదని భారత్ స్పష్టం చేసిందన్నారు.
……………………………………..