
* ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* ప్రధాని మోదీ
ఆకేరున్యూస్, ఢిల్లీ: సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూకంపం సంభవించడంతో ప్రధాని మోదీ స్పందించారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉదయం 5.36 గంటలకు ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. తెల్లవారుజామున 5 నుంచి 8 సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులుపెట్టారు. అంతకుముందు బంగాళాఖాతంలో కూడా భూమి కంపించింది. ఆదివారం రాత్రి 11.16 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.
………………………………..