
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : 79 ఏళ్లలో భారతదేశంలో కేటీఆర్ లా పాలించిన నాయకుడే లేడని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహేంద్ర తోటకూరి రాసిన ప్రజా యోధుడు పుస్తక ఆవిష్కరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ పాలనలో పడావు పడ్డ తెలంగాణను పదేండ్లలోనే అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా కేసీఆర్ తీర్చిదిద్దారని అన్నారు. పదేండ్లలో కేసీఆర్(KCR) ప్రభుత్వం చేసిన అప్పును రేవంత్ రెడ్డి కేవలం 20 నెలల్లోనే చేశారని కేటీఆర్ అన్నారు.తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద పరిస్థితులు ఏ మాత్రం తెలియవని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతుంటే రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచించడమే దుస్సాహసమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని కేసీఆర్ ను ప్రజాకవి గోరటి వెంకన్న ప్రశంసించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు అన్నారు.భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పుస్తకావిష్కరణ జరగడం సముచితం, తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కేసీఆర్‌కి ఇది గొప్ప కానుక అని కేటీఆర్ అన్నారు.కేసీఆర్ అప్పులు చేశారని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెంపదెబ్బ లాంటి సమాధానాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ. 2 లక్షల 80 వేల కోట్లు మాత్రమే చేశారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, తెలంగాణ ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అన్న కేటీఆర్, వ్యవసాయంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చారని తెలిపారు. భారతదేశంలో మొదటిసారి ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాన్ని తీర్చడంతో పాటు నల్గొండలో ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తుడిచి పెట్టిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ హయాంలోనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు అయిందని అన్నారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం పెట్టి రూ. 73 వేల కోట్లను 70 లక్షల మంది రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని అన్నారు. 2004లో భారతదేశానికి తిరిగి వచ్చి ఉద్యోగం చేస్తూనే 2006 వరకు జయశంకర్ సార్, విద్యాసాగర్ సార్, కేసీఆర్‌గారితో గడిపే అవకాశం తనకు దక్కిందని కేటీఆర్ అన్నారు.ఈ రెండు సంవత్సరాల కాలంలో చాలా అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కలిగిందన్నారు.ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ కోసం ఒక పార్టీ పెట్టి తెలంగాణ సాధించడం గొప్ప విషయం అన్నారు.పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వయస్సు 47 ఏళ్లు. రాజకీయ నాయకులకు అది టేకాఫ్ టైం. ఆ సమయంలో ఒక లక్ష్యంతో ప్రజల కోసం ముందుకు రావడం సాధారణ సాహసం కాదని కేటీఆర్ అన్నారు.దృఢ సంకల్పం, దైవ బలం ఉన్న యోధుడికే అది సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు
……………………………………..