
* షడ్రుచుల కలయికలా భట్టి బడ్జెట్
* ఏ విధానానికీ నూరు శాతం ఆమోదం ఉండదు
* ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) తెలిపారు. రవీంద్రభారతిలో జరిగిన ఉగాది వేడుకలను సీఎం ప్రారంభించారు. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్.. షడ్రుచుల కలయిక మాదిరిలా ఉందన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించామన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని, అందుకే వాటికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రపంచస్థాయిలో హైదరాబాద్(Hyderabad)కు గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఫ్యూచర్ సిటీ (Future City) వంటి నగరం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ అంటే ప్రజలు నిశించే నగరమే కాదని, పెట్టుబడుల నగరమని వివరించారు. లక్షలాది మందికి ఉపాధి కలిగించేలా సిటీ నిర్మాణం ఉంటుందన్నారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవని, ఏ విధానానికీ నూటికి నూరు శాతం ఆమోదం ఉండదని అన్నారు. దేవుళ్లను విశ్వసించే విషయంలో్నే ఏకపక్ష ఆమోదం ఉండదని వెల్లడించారు.
………………………………………………………….