* మంత్రివర్గ విస్తరణ అధిష్టానం పరిధిలో ఉంది
* సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
* విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
* పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ…ఎమ్మెల్యేలకు సిఎం రేవంత్ రెడ్డి సున్నితంగా హెచ్చరిక చేశారు. ఎవ్వరు కూడా పాª`టీ లైన్ దాటి మాట్లాడవద్దని అన్నారు. మంత్రివర్గ విస్తరణ అన్నది అదిష్టానం నిర్ణయమని కూడా స్పష్టం చేశారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనభాపక్ష సమావేశంలో సిఎం రేవంత్ మాట్లాడారు. తనకు మంత్రి పదవి రాకుండా జానా రెడ్డి అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రచ్చ చేస్తే.. పదేళ్లు పార్టీని కాపాడుకున్న మమ్మల్ని కాదని.. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు ఇస్తారా అని ప్రేమ్‌సాగర్ రావు పరోక్షంగా ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారు. మంత్రి పదవులను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానందే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని అన్నారు. విూరు మాట్లాడేదంతా రికార్డవుతుందని హెచ్చరించారు.అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ సోషల్‌విూడియా వాడటం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటే.. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని అన్నారు. వీకెండ్ రాజకీయాలు చేయొద్దని సూచించారు. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్. దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని సీఎం తేల్చి చెప్పారు. మంత్రి పదవులపై ఒకరికి మించి మరొకరు లీకులు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన సీఎం.. ఇష్టం వచ్చినట్లు- మాట్లాడితే మంత్రి పదవులు రావన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు. కాగా, మంత్రి వర్గ విస్తరణపై కొందరు ఆశావహులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఏకంగా హుకుం జారీ చేశారు. మరోవైపు.. మంత్రి పదవి విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలా మంత్రి వర్గ విస్తరణపై ఆశవహులు బహిరంగంగ మాట్లాతుండటంతోనే తాజాగా జరిగిన సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు దిశా నిర్దేశర చేశారు. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకమవుతా. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మి.. బుల్డోజర్లు పంపిస్తున్నారని ప్రధాని మాట్లాడుతున్నారు. భాజపా, భారాస కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణ మోడల్‌పై దేశంలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే భాజపా, భారాస ఒక్కటయ్యాయి. సన్నబియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్. భాజపా పాలిత రాష్టాల్ల్రో సన్నబియ్యం ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క,పొంగులేటి, శ్రీధర్ బాబు, పొన్నం, పిసిస చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
—————–
