* కేంద్రం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వట్లే
* శాసనమండలిలో మంత్రి దుద్దదిళ్ల శ్రీధర్‌బాబు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గోదావరి నుంచి 2.5 టీఎంసీలు మూసీకి తరలించే ప్రాజెక్టుకు కేంద్ర సహకారం కావాలని, కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని మంత్రి శ్రీధర్ బాబు (Sridharbabu)తెలిపారు. నిధుల కోసం ప్రయత్నం చేయాలని పలుమార్లు కేంద్ర మంత్రులను కోరామన్నారు. గోదావరి (Godavari) నుంచి నీటి తరలింపునకు కేంద్ర సహకారం కోరామన్నారు. గుజరాత్(Gujarath), యూపీ (UP) రాష్ట్రాలకు నిధులిచ్చి నదులను ప్రక్షాళన చేసుకున్నారని గుర్తు చేశారు. అదే విధంగా తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ, మూసీ ప్రక్షాళనపై వెనకడుగు వేసేది లేదని మంత్రి తెలిపారు. తాగునీటి కష్టాలు, మూసీ(Musi) ప్రక్షాళన తదితర అంశాలపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
………………………………….
