
* ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్
* ఢిల్లీలో ఎన్నికల సంఘం మీడియా సమావేశం
ఆకేరు న్యూస్ డెస్క : విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎన్నికల సంఘం భయపడేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఢిల్లీ( DELHI) లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర ఎన్నికల అధికారులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి ఏ పార్టీ పట్ల వివక్ష ఉండదని అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ( CHIEF ELECTION COMMISSIONER GNANESH KUMAR) అన్నారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని, అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషనర్ ఎలా వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు. బిహార్ (BIHAR)ఎస్ఐఆర్ (SRI)పై జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, డబుల్ ఓటింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు చేసేటప్పుడు సాక్ష్యాలు ఉండాలని అన్నారు.పేదలు, ధనికులు, వృద్ధులు, యువకులు, మహిళలు, మతం, సామాజిక-అర్థిక హోదా అనే వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ అండగా నిలుస్తోంది. ఇకముందు కూడా నిలుస్తుంది. ఎన్నికల కమిషన్ నిర్భీతిగా వ్యవహరిస్తుంది’ అని స్పష్టం చేశారు.రాజ్యాంగ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ వెనక్కు మళ్లే ప్రసక్తే లేదన్నారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు రిజిస్టర్ చేసుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని సీఈసీ అన్నారు. తమకు అన్ని పార్టీలు సమానమేనని, పార్టీల సిద్ధాంతాలు, అఫిలియేషన్తో తమకెలాంటి సంబంధం ఉండదని, చట్టప్రకారం అందర్నీ సమనంగా చూస్తామని వివరించారు.
……………………………………