
* భారత రాజ్యాంగమే దారి చూపుతోంది
*వికసిత్ భారతే లక్ష్యం
* అపరేషన్ సింధూర్ తో సత్తా చాటాం
* యువతకు ఉపాధికి కొత్త పథకాలు
* ఎర్రకోట పై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని
ఆకేరున్యూస్,డెస్క్ : భారతదేశం ఈ రోజు ఇంత బలంగా నిలబడకలిగిందంటే అది భారత రాజ్యాంగం వల్లే అన్ని ప్రధాని నరేంద్ర మోదీ (NARENDRA MODI)అన్నారు. 79 వ స్వాతంత్య్ర స్వాంత్య్ర దినోత్సవం (79th INDEPENDENCE DAY) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట(RED FORT) నుంచి జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గత 75 ఏళ్లుగా భారత రాజ్యాంగం మన ప్రయాణానికి దారి చూపుతోందని మోదీ గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని, దేశ భవిష్యత్తును మనమే నిర్మించాలి అని చెప్పారు. ఈ రోజు ప్రతీ భారతీయుడు తన బాధ్యతలను గుర్తుంచుకొని ముందుకు సాగే సంకల్పం తీసుకోవాలని అన్నారు.స్వాతంత్య్ర దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
భారత జవాన్లకు సెల్యూట్
ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్. మన వీర జవాన్లు శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టారు. పహల్గామ్లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపారు. భార్య, కన్నబిడ్డల కళ్లెదుటే దారుణంగా కాల్చి చంపారు’ అని అన్నారు.‘పహల్గామ్ దాడి(PAHALGAM ATTACK) తో యావత్ దేశం ఆక్రోశంతో రగిలిపోయింది. ఆపరేషన్ సిందూర్(OPERATION SINDHUR) తో మన సత్తా చాటాం. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు నిద్ర పట్టకుండా చేశాం. ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ధి చెప్పింది. ఇకపై బ్లాక్మెయిల్ చేసేవారిని ఉపేక్షించేది లేదు. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడేది లేదని మోదీ అన్నారు. దేశ భద్రతను ఎవరైనా ప్రశ్నిస్తే, తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. భయం చూపించి భారత్‌ను వెనక్కి తొలగించే ప్రయత్నాలు ఫలించవని తేల్చి చెప్పారు.ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దానిపై స్పందిస్తూ, అప్పుడే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిందని మోదీ గుర్తు చేశారు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవు అనే మాటలు ఈ సందర్భంలో మరోసారి పునరావృతం చేశారు.
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన
నరేంద్ర మోదీ దేశంలోని యువతకు తీపి కబురు చెప్పారు
లక్ష కోట్లతో దేశంలోని నిరుద్యోగుల కోసం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన
(PRIME MINISTER VIKASITH ROJGAR YOJANA)పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దేశంలోని యువతకు ఉపాధి క్పించడమే ధ్యేయమన్నారు.రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమన్నారు. జీఎస్టీ భారాన్ని కూడా తగ్గించనున్నట్లు తెలిపారు
…………………………………………….