
* నేను విమర్శలకు భయపడే రకం కాదు
* ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తనను విమర్శిస్తే భయపడి పోటీ నుంచి తప్పుకుంటానని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఉప రాష్ట్రపతి ( VICE PRESIDENT) అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (JUSTICE SUDERSHAN REDDY) అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఏవేవో ముద్రలు వేసి బదనాం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తనను విమర్శించే వారు తాను ఇచ్చిన తీర్పు ఒక్కసారి చదవాలని సూచించారు. కోర్టు తీర్పుల గురించి మాట్లాడేవారు వాటిని చదివి మాట్లాడాలని కోరారు. అది తన తీర్పు కాదని.. కోర్టు తీర్పు అని ఉద్ఘాటించారు. తన తీర్పును 11 మంది న్యాయమూర్తులు చదివారని… అందులో ఒక్క విషయాన్ని కూడా మార్చలేకపోయారని సుదర్శన్ రెడ్డి అన్నారు. నేడు రాజ్యాంగం ,ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోందని సుదర్శన్ రెడ్డి హెచ్చిరించారు. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని ప్రతిపక్షాల అభ్యర్థిని అని సుదర్శన్ రెడ్డి అన్నారు. తనను భయపెట్టాలని చూస్తే భయపడే రకం కాదని పోరాట పటిమ తనలో ఉందని సుదర్శన్ రెడ్డి తెలిపారు.
…………………………………………………..