
ఆకేరున్యూస్, హైదరాబాద్ : మాజీ పోలీస్ ఉన్నతాధికారి బీఆర్ ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు.అయితే విచారణ అధికారుల మందు ప్రవీణ కుమార్ వాంగ్మూలం ఎలా ఇచ్చారు అనే దానిపైనే సర్వత్రా ఆసక్తి ఉంది. 2023 ఎన్నికల సమయంలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసిందని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఎన్నికల సంఘానికి డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ కుమార్ ఉన్నట్లుండి కేసీఆర్ పంచన చేరారు. ఎన్నికల తరువాత ఆయన బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ ఎస్ లో చేరారు. ఈ నేపధ్యంలో గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన ప్రవీణ్ కుమార్ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరయ్యారు. విచారణ అధికారుల ముందు తన వాదన ఏం విన్పించాడనేదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
…………………………………………