
* మళ్లీ యూనిర్సిటీకి వస్తా.. మీటింగ్ పెడతా
* ఎవరింకేవాలో నిరంభ్యతరంగా చెప్పొచ్చు
* అక్కడికక్కడే జీవోలు జారీ చేస్తా
* విద్యార్థులు నిరసన తెలిపినా ఏమీ అనను
* ఓయూ లేకపోతే తెలంగాణ చరిత్రే లేదు
* ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
* యూనివర్సిటీకి వరాల జల్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : నేను వస్తా.. మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా.. అక్కడ ఇక్కడ కాదు.. ఆర్ట్స్ కాలేజీ వద్దే మీటింగ్ పెడతా. డీజీపీకి, సిటీ కమిషనర్‌కు ఆదేశాలు ఇస్తున్నా.. ఆరోజు వర్సిటీలో ఒక్క పోలీసు కూడా ఉండొద్దు.. ఎవరింకేవాలో నిరంభ్యతరంగా చెప్పొచ్చు.. నిరసన కూడా తెలపొచ్చు. ఎవరినీ ఏమీ అనను.. అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఉస్మానియా పర్యటనపై బీఆర్ ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. వర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఈరోజు రేవంత్ మాట్లాడుతూ ఓయూకు వరాల జల్లు కురిపించారు. వర్సిటీ అభివృద్ధికి నిధులు ఆడిగేందుకు వీసీ, ఇతర అధికారులు పేదరికం ఆలోచిస్తున్నారని, ఓయూకు వెయ్యి కోట్లు ఎందుకు ఇవ్వకూడదని అన్నారు. మీరు అంచనాలను ఇవ్వండి.. నేను నిధులు ఇస్తా.. అని రేవంత్ హామీ ఇచ్చారు.
ఏంకావాలో రాసి పెట్టోకోండి…
తెలంగాణ వచ్చిన డిసెంబర్ నెలంటే తనకు ఇష్టమని, మళ్లీ అప్పుడే మీటింగ్ పెట్టాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. వీసీకి, పోలీసులకు చెబుతున్నా.., ఆరోజు ఏ విద్యార్థీ ఏ నిరసన తెలిపినా ఏమీ అనొద్దు.. నిరసన తెలిపే స్వేచ్ఛ నివ్వండి అన్నారు. తెలంగాణ వచ్చిన డిసెంబర్లోనే మీటింగ్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్దే సెక్యూరిటీ లేకుండా తాను మీటింగ్ పెడతానన్నారు. ఏంకావాలో రాసి పెట్టోకోండని సూచించారు. అదే రోజు అక్కడికక్కడే జీవోలు ఇస్తానన్నారు. విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పే చిత్తశుద్ధి తనకుందన్నారు. రాబోయే 6నెలల్లో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఓయూ లేకపోతే తెలంగాణ చరిత్రే లేదు.. అటువంటి వర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఎందుకు ఇవ్వకూడదన్నారు.
ఓయూ అభివృద్ధికి కమిటీ
ఓయూ అభివృద్ధికి కమిటీ వేయాలని యోగితారాణాను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున, వర్సిటీ తరఫున అధికారులు ఆ కమిటీలో ఉండాలన్నారు. ఓయూకు ఏం కావాలన్ని ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఆక్స్ ఫర్డ్ స్థాయికి ఓయూను తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించాలన్నిరు. మీరు అవకాశం ఇస్తేనే తాను సీఎం అయ్యానని, అమెరికా నుంచి రాలేదని తెలిపారు. ఇక్కడే చదివవాను.. ఇక్కడే ఎదిగాను.. గుంటూరు ఫుణె వెళ్లలేదన్నారు.
నేనైతే చెంప పగులగొడతా
ప్రొఫెసర్ కోదంరామ్ లాంటోళ్లను చట్టసభలకు పంపిస్తే.. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రొఫెసర్ ను ఎమ్మెల్సీ నుంచి తప్పించారని రేవంత్ విమర్శించారు. పాపం ఆ సార్ ఇంటి తలుపులు పగులగొట్టినా ఊరుకున్నారని, తానైతే చెంపలు పగలు గొట్టేవాడినని తెలిపారు. అలాంటి ప్రొఫెసర్లకు చట్టసభలకు వెళ్లే అర్హత లేదా అని ప్రశ్నించారు. ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు ఇస్తున్న ప్రభుత్వం తమదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన దగ్గర భూములు లేవని, ఖజానా ఖాళీగా ఉందని, తాను ఇవ్వగలిగింది చదువు ఒక్కటే అని తెలిపారు.
…………………………………..