* జాతీయ అవార్డులను ప్రకటించిన కేంద్రం
* ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య ప్రకటన
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించింది. క్రీడాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖేల్ రత్న(Khel ratna) అవార్డుల ఎవరికో తెలిపింది. ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్(Gukhesh)ను ఖేల్ రత్న వరించింది. అలాగే, షూటింగ్ లో ఒలింపిక్ పతక విజేత మనూభాకర్(Manubhakhar) కు, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(HarmanpreethSing)కు, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్(PraveenKumar)కు కూడా ఖైల్ రత్న ప్రకటించింది. అలాగే, 32 మందికి అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య గ్రహీతలను కూడా ఎంపిక చేసింది. ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) చేతుల మీదగా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది.
………………………………………….