ఆకేరున్యూస్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇవాళ భేటీ అయ్యారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంని కలిశారు. ఈ భేటీలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చియి. సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది.
ప్రభుత్వ ప్రతిపాదనలు..
* ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినిమా ఇండస్ట్రీ సహకరించాలి.
* డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలి.
* డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో హీరోలు, హీరోయిన్లు కచ్చితంగా పాల్గొనాలి.
* సినిమా టికెట్లపై విధించే సెస్సును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెట్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.
* కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి తారలు సహకరించాలి
* బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చు
…………………………………..