
* వివరాలు వెల్లడించిన సైన్యం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులు, వారి స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా 7వ తేదీన చేపట్టిన దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వివరాలను తాజాగా వెల్లడించింది. హతమైనవారిలో ముగ్గురు జైషే మహమద్ కు చెందిన అగ్రనేతలు ఉన్నారు. ఇద్దరు లష్కరే తోయిబా నేతలు ఉన్నారు. ఈనెల 7న భారత్ మట్టుబెట్టిన ఆ ఉగ్రవాదుల పేర్లను తాజాగా ఆర్మీ వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్లో ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ (లష్కరే తోయిబా) హతమయ్యాడు. పాక్ ఆర్మీ లాంఛనాలతో ఉగ్రవాదికి అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్, పాక్ లోని పంజాబ్ సీఎం కూడా అంత్యక్రియలకు హాజరైనట్లు తెలిసింది. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులు కూడా హతమయ్యారు. వారిలో మసూద్ పెద్ద బావమరిది హఫీజ్ మహ్మద్ జమీల్, మరో బావమరిది మహ్మద్ యూసఫ్ అజార్ ఉన్నారు. లష్కరే తోయిబాకు చెందిన ఖలీద్ లను భారత్ సైన్యం మట్టుబెట్టింది.
……………………………………………………….