
* రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడడం లేదు
* నేను, భట్టి చర్చకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ఇచ్చారు.. తెలంగాణ(Telangana)కు ఎందుకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy) ప్రశ్నించారు. తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత? కేంద్రం ఇస్తున్న నిధులు ఎంత? అన్నింటిపైనా మీరు చర్చకు వస్తానంటే, తాను, భట్టి (Bhatti) చర్చకు వస్తామని రేవంత్ అన్నారు. రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లయినా ఢిల్లీ (Delhi) వెళ్తా అన్నారు. తాను ఢిల్లీకి వెళ్లడం వల్లే హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధికి క్లియరెన్స్ వచ్చాయని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నది బీఆర్ ఎస్ కాదా అని ప్రశ్నించారు. హరీశ్‌రావు (Harishrao) లాంటి వాళ్లు పట్టభద్రుల ఎన్నికల్లో దొంగదెబ్బ కొట్టారు.
……………………………………..