
* మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి పాలనను అసహ్యించుకుంటన్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.స్థానిక సంస్థల ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని విమర్శించారు.మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త.. శక్తికి మించి పనిచేయాలని అప్పడే విజయం చేకూరుతుందన్నారు. కేసీఆర్ మీద వస్తున్న ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని.. జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
………………………………………..