
* కానీ..పచ్చబొట్టు ప్రాణం నిలిపింది..
* నిరంజన్ రెడ్డి మీద ఉన్న అభిమానమే అతని ప్రాణాలు నిలిపింది
ఆకేరు న్యూస్,మహబూబ్ నగర్ : మనిషి పోయాడనుకున్నారు బంధువులంతా వచ్చారు.. ఓ వైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.. కానీ. అతని చాతిపై ఉన్న పచ్చబొట్టు అతని ప్రాణాలను కాపాడింది. బీఆర్ ఎస్ లీడర్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిమీద అతనికి ఉన్న అభిమానమే అతడు తిరిగి కళ్లు తెరిచేలా చేసింది. వివరాల్లోకి వెళితే వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో తైలం రమేష్ అనే వ్యక్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వీరాభిమాని ఆయన బొమ్మను చాతీపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. అయితే రమేష్ తన బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ల ఇంట్లో అల్పాహారం తీసుకున్నాడు. తిన్న కొద్ది సేపటికే రమేష్ చలనం లేకుండా పడిపోయాడు. అక్కడున్న వారు అందరూ రమేష్ చనిపోయాడని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఓవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తైలం రమేష్ చనిపోయాడని తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అతడిని చివరిచూపు చూడడానికి అక్కడికి చేరుకున్నారు.ఈ క్రమంలో తన మీద అభిమానంతో రమేష్ చాతీపై వేయించుకున్న పచ్చబొట్టును పరిశీలిస్తుండగా రమేష్ ఊపిరి తీసుకుంటున్నట్లు గమనించారు. వెంటనే హుటాహుఏటిన రమేష్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా రమేష్ మెల్లగా కళ్లు తెరిచారు. దీంతో రమేష్ కుటుంబసభ్యులు ఆశ్చర్యంతో పాటు ఆనందానికి లోనయ్యారు.
……………………………………..