
* ముసుగు వేసుకున్న చెదల్లాంటి వాళ్లను నమ్మొద్దు
* అబద్దాల సంఘాలు పుట్టుకొస్తున్నాయి..
* బీఆర్ ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం సీఎం రేవంత్ (REVANTH) పర్యటన ఆసక్తిగా సాగింది. తొలుత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఆయన అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఓపక్క ఓయూకు వరాలు ఇస్తూనే.., మరో పక్క విపక్షాలపై విమర్శలు కురిపించారు. బీఆర్ ఎస్(BRS), ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షకోట్లు కాళేశ్వరంలో గంగపాలయ్యాయని అన్నారు. అబద్దాల సంఘాలు పుట్టుకొస్తున్నాయని, అబద్దాలను నమ్మవద్దని సూచించారు. సెంట్రల్ వర్సిటీలో ఏనుగులు, సింహాలు ఉన్నాయని, తాను చంపేస్తున్నానని ఏఐ ఉపయోగించి వీడియోలు క్రియేట్ చేశారని, అసత్యాలు ప్రచారం చేశారని తెలిపారు. అక్కడ అలాంటివి ఏమీ లేవయ్యా అని వివరించారు. తెలంగాణ సమాజానికి వాళ్లు ముసుగు వేసుకున్న చెదల్లాంటి వారని, వాళ్లు మళ్లీ వచ్చారంటే ఉస్మానియా వర్సిటీ(OSMANIA UNIVERSITY) ని లే అవుట్లు వేసి అమ్మేస్తారని విమర్శించారు. పదవి కోల్పోవడంతో ఏడుస్తున్నారని, 18 నెలల్లో ఒక్క మంచి పనిని కూడా వాళ్లు మెచ్చుకోలేదన్నారు. వైస్ చాన్సలర్లను, నియమించాము.. గలీజు గంజాయిని నిర్మూలించాము.. సన్నబియ్యం ఇచ్చాము.. ఇవన్నీ మంచి పనులు కాదా అని ప్రశ్నించారు.
………………………………………..