
* ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఘటన
*పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ
* భద్రతాలోపాలపై అమిత్ షాకు లేఖ
ఆకేరున్యూస్ డెస్క్: వీధుల్లో నడుస్తున్న మహిళల మెడలోనుంచి గొలుసు లాక్కెళ్లే సంఘటనలు దేశంలో చాలా చోట్ల తరచుగా .జరుగుతుంటాయి. కానీ ఢిల్లీలో జరిగిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రాజధానిలో ఒక మహిళా ఎంపీకి రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయా అన్పిస్తోంది. ఢిల్లీలోని చాణక్యపురి (DELHI CHANAKYAPURI) ప్రాంతంలో తమిళనాడు( TAMILANADU)కు కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ (MP SUDHA RAMAKRISHNAN)సహచర ఎంపీ రాజాతి (డీఎంకే) (MP RAJATHI)తో కలిసి ఉదయం వాకింగ్ చేస్తుండగా. మార్నింగ్ వాక్ చేస్తుండగా దుండగులు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు.విఐపీలు, వీవీఐపీలు ఉండే ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అంత సెక్యూరిటీ మధ్య దుండగులు ఓ మహిళా ఎంపీ మెడలోని గొలుసును లాక్కెళ్లారంటే ఇప్పుడు ఈ ఘటన రాజధానిలో భద్రతపై పలుఅనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై సుధా రామకృష్ణన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(AMITH SHAA)కు ఈ విషయంపై లేఖ రాస్తూ.. దేశ రాజధానిలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
గొలుసు దొంగతనంపై ఎంపీ సుధా రామకృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోమవారం ఉదయం సుమారు 6.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఎంపీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె తన సహచర ఎంపీ రాజాతి (డీఎంకే)తో కలిసి ఉదయం వాకింగ్ చేస్తుండగా.. హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి స్కూటర్‌పై వేగంగా వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కొని పారిపోయయినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను కింద పడిపోయి.. మెడకు గాయాలు అయినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పెనుగులాటలో తన దుస్తులు కూడా చినిగిపోయినట్లుగా ఆమె వివరించారు. ఘటన తమను భయభ్రాంతులకు గురి చేసిందని ఆమె తెలిపారు. గొలుసు నాలుగు తులాలకు పైనే ఉంటుందని ఆమె వివరించారు.
……………………………………