
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి
* హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లో పేరుకే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందని, బస్తీలు, కాలనీల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (KISHAN REDDY) అన్నారు. మౌలిక వసతుల కల్పనకు కూడా నిధుల కొరత ఉండడం దురదృష్టకరమన్నారు. తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ (SECUNDERABA) పార్లమెంట్ నియోజకవర్గంలో మంగళవారం మధ్యాహ్నం కిషన్రెడ్డి పర్యటించారు. కాలనీల్లో ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. కాలనీల్లో తాగునీరు, వీధిలైట్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. హైటెక్ సిటీ, హంగులు చూపించి హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందంటే అది పొరపాటని అన్నారు. రాష్ట్రానికి అధిక ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్నా, కనీస సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందడం దురదృష్టకరమన్నారు. ఒట్టేసి చెబుతున్నా.. తెలంగాణ (TELANGANA) అభివృద్ధికి కట్టుబడి ఉంటానని నిన్న పేర్కొన్న కిషన్ రెడ్డి.. ఈరోజు హైదరాబాద్ లోని కాలనీలు, బస్తీల్లో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించడం ఆసక్తిగా మారింది.
……………………………………….