* చేవెళ్ల ఘటనలో మృతి చెందిన..
* ముగ్గురు కూతుళ్ల తండ్రి మిన్నంటిన రోదన..!
* తండ్రి బాధతో..స్థానికుల్లో కన్నీరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చేవెళ్ల ఘటన కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 7 లక్షల చొప్పున రూ. 21 లక్షల చెక్కును అందించింది. ఈ పరిహారం తీసుకుంటూ తండ్రి ఎల్లయ్య గౌడ్ గుండెలు అవిసేలా రోదించాడు. ఇదీ.. నా కూతుళ్లు తెచ్చిన జీతమా అంటూ.. కన్నీరు పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు సైతం కంటనీరు పెట్టారు. తన రెండో కూతురు నెలకు ఉద్యోగం చేస్తూ రూ. 60 వేలు సంపాదించేదని తెలిపాడు. ఎల్లయ్య గౌడ్ కూతుళ్లు ముగ్గురూ హైదరాబాద్లోని కాలేజీకి వెళ్లే క్రమంలో చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
……………………………………………
