
*కార్పొరేట్ కబంధహస్తాలలో చదువు
*నటుడు,నిర్మాత,దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి
ఆకేరు న్యూస్ హనుమకొండ : ఇది లీకేజీల యుగం అని పరీక్ష పేపర్లు లీక్ కావడం సర్వ సాధారణంగా మారిందని నటుడు నిర్మాత దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఈ రోజు హనుమకొండలోని ప్రెస్ క్లబ్లో నారాయణ మూర్తి సినిమా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా వాల్ పోస్టర్ను విడుదల చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భగా ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ ఈరోజు ఎక్కడ చూసినా పేపర్ లీకేజ్ అనేది సర్వసాధారణంగా మారిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల పేపర్ లీక్ అవ్వడం ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ విద్యార్థుల పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం అంటే ఈ సమాజాన్ని నాశనం చేయడమే అని అన్నారు. కార్పొరేట్ కబంధహస్తాలలో ఈరోజు విద్య ఇరుక్కొని పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సేవా రంగంగా ఉండాల్సిన విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపార రంగంగా మార్చారని మండిపడ్డారు. తన సినిమాని ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులు, నిరుద్యోగులు విద్యార్థులు అధిక సంఖ్యలో చూసి విజయవంతం చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్
ఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ ఆర్ నారాయణ మూర్తి సినిమాలు సమాజానికి మేలు కొల్పేలే ఉంటాయని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల బాధలను సమాజంలో నేడు జరుగుతున్న అసమానతలను,అన్యాయాలను ఎత్తి చూపిస్తూ సందేశాత్మక సినిమాలు చేస్తారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, జిల్లా సహాయ కార్యదర్శి కసర బోయిన రవితేజ, జిల్లా సమితి సభ్యులు, సిపతి వినయ్.పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ. పిడిఎస్యు యూనివర్సిటీ అధ్యక్షుడు విజయ్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయకులు వినయ్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………….