
* ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగానే కార్మికులకు ఇక్కడ టారీఫ్
* కార్మికులతో చిరంజీవి మాట్లాడతా అన్నారు
* రేపు ఫెడరేషన్ వారు ఆయనను కలుస్తారు..
* సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవితో భేటీ అనంతరం సి. కల్యాణ్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : నిర్మాతల బలహీనతల వల్లే సినీ పరిశ్రమలో ఈ దుస్థితి వచ్చిందని, నిర్మాతలు ప్రధానంగా చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. సినీ కార్మికుల సమ్మె పై చిరంజీవి(Chiranjeevi)ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీ సమస్యలపై చిరంజీవి రోజూ ఫాలోప్ చేస్తూనే ఉన్నారని తెలిపారు. రేపు ఫెడరేషన్ వారు కూడా ఆయనను కలవనుననట్లు వివరించారు. తన వంతుగా కార్మికులతో మాట్లాడాతానని చిరంజీవి పేర్కొన్నట్లు తెలిపారు. ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడాసమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని, తనకున్న నుభవంతో ప్రాక్టీకల్ గా ఉండే సమస్యలను చిరంజీవికి వివరించానని తెలిపారు ఇతర రాష్ట్రాల కంటే టారీఫ్ ఎక్కువే గానే ఇక్కడ కార్మికులకు ఉందన్నారు. చిరంజీవి పెద్ద మనిషిగా , ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సి కళ్యాణ్ (C.Kalyan) తెలిపారు. లేబర్ కమీషనర్ రికార్డ్ రూల్స్ ప్రకారం సినిమాలకు వర్క్ చేయలేమని, ఓ ఫ్యామిలీ లా కలిసి వర్క్ చేసుకోవటం అలవాటు అయిపొయిందని అన్నారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
…………………………………………..