Sarpanch Ramesh Wedding Ceremony
ఆకేరు న్యూస్, తొర్రూరు: మండలంలోని నాంచారి మడూర్ గ్రామ సర్పంచ్ బంగారి రమేష్ వివాహ వేడుకల్లో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సుంచు సంతోష్, మెరుగు మల్లేశం గౌడ్, మండల నాయకులు హనుమాన్ల నరేందర్ రెడ్డి, చిట్టిమల్ల మహేష్, గోపాలగిరి గ్రామ సర్పంచ్ ఎనమాల సావిత్రి శ్రీనివాస్, కంఠయపాలెం సర్పంచ్ సంగీత జగదీశ్వర్ కారపాటి లక్ష్మణ్, పనికర వెంకన్న తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
