
* ఒక్క అంగుళం కూడా సెంట్రల్ వర్సిటీది లేదు
* విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు : టీజీఐఐసీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ (TGIIC) ప్రకటన విడుదల చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని ప్రకటించింది. ప్రాజెక్టులో సెంట్రల్ వర్సిటీ భూమి లేదని పేర్కొంది. భూమి తమదేనని కోర్టు ద్వారా ప్రభుత్వం దేనిరూపించుకుంందని తెలిపింది. వేలం, అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవని వెల్లడించింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవంది. సర్వేలో ఒక్క అంగుళం కూడా సెంట్రల్ వర్సిటీ(CENTRAL VERSITY) ది లేదని స్పష్టం చేసింది. తాజా అభివృద్ధి ప్రణాళిక రాళ్ల రూపాలను దెబ్బతీయదని, స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంని వివరించింది. కొందరు నేతలు విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. 400 ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉందని తెలిపారు. అటవీ భూమిపై కొన్ని మీడియాల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయని అన్నారు. ఆ భూముల్లో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ (PEACOCK LAKE)వంటివి ఏమీ లేవని వివరించారు.
……………………………………………………..