
* ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రెవెన్యూశాఖలో వేలాది కొత్త పోస్టులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులను మంజూరు చేసింది. మాజీ వీఆర్ ఓలు, వీఆర్ ఏల నుంచి ఆప్షన్ తీసుకుని నియమాకం చేపట్టనుంది. గ్రామపాలనా అధికారుల పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కావాల్సిన తదుపరి చర్యలను తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరింది.
…………………………………..