
* ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు చేశారు. 4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్‌రెడ్డి తమను సంప్రదించి తనను తాను పరిచయం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి వద్ద సోషల్‌విూడియా హ్యాండ్లర్‌గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు వివరించారు. చంద్రకిరణ్‌రెడ్డి మాతో కలిసి పనిచేస్తూ తన సొంత వ్యాపారాన్ని బలపరుచుకున్నారు. స్వలాభం కోసం మా పేరును వాడుకున్నారు. అతని పనితీరు నచ్చకపోవడంతో చంద్రకిరణ్ సేవలను వినియోగించుకోలేదు. మేం భాజపాలో ఉన్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడిరది. ఆ పార్టీలో ఎదిగేందుకు చంద్రకిరణ్ మమ్మల్ని వాడుకున్నారు. భాజపాలో నుంచి బయటకు వచ్చాక అతడి నుంచి మెసేజ్ వచ్చింది. పెండిరగ్లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా అని అందులో ఉంది. ఈక్రమంలో మావద్ద బకాయిలు ఏవిూ లేవని సమాధానమిచ్చాం. అయితే ఏప్రిల్ 6న చంద్రకిరణ్‌రెడ్డి బెదిరింపు సందేశం పంపాడు. బకాయిలు తీర్చకుంటే విూరు శత్రువులు అవుతారని మెసేజ్ చేశాడు. ఆమోదయోగ్యం కాని రీతిలో సందేశాలు ఉన్నాయి. చంద్రకిరణ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. విూ ఇద్దరినీ చంపేస్తా.. రోడ్డుకీడుస్తా.. అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు విజయశాంతి దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే చంద్రశేఖర్ పనితీరు నచ్చకపోవడం, సరైన ఫలితాలు రాకపోవడంతో శ్రీనివాస ప్రసాద్ అతడిని ఆఫీసు నుంచి పంపించేశారు. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న చంద్రశేఖర్.. ఇటీవల శ్రీనివాస్ ప్రసాద్‌కు మెసేజ్ చేశాడు. డబ్బులు ఎప్పుడిస్తారంటూ నిలదీశాడు. కాంట్రాక్ట్ కుదుర్చుకోకుండానే డబ్బులు ఎలా ఇస్తామని ఆయన అడగ్గా అసభ్యంగా దూషించాడు. ఏదైనా ఉంటే ఆఫీసుకి వచ్చిన మాట్లాడాలని ఆయన చెప్పగా తాను రానని చెప్పాడు. మరోవైపు… తనకు డబ్బులు ఇవ్వాలంటూ విజయశాంతి భర్తకు చంద్రశేఖర్ మెసేజ్‌లు, మెయిల్స్ పంపుతూ వేధించసాగాడు. వాటికి శ్రీనివాస్ స్పందించకపోవడంతో.. చివరికి డబ్బులు ఇవ్వకపోతే నిన్ను, నీ భార్య విజయశాంతిని రోడ్డు విూదికి ఈడుస్తా.. ఇద్దరినీ చంపేస్తానంటూ చంద్రశేఖర్ బెదిరింపులకు దిగాడు. దీంతో విసిగిపోయిన విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
……………………………..