
* పంచాయతీరాజ్ చట్టసవరణ
* పురపాలక సంఘాల చట్టసవరణ
* అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి (Telangana Legislative Council) మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. సోమవారం సభ ప్రారంభమైన తరువాత బిల్లులపై చర్చ జరిగింది. చర్చ జరిగినంత సేపూ బీఆర్ ఎస్ సభ్యులు ఆందోళన చేసి గందరగోళ వాతావరణం సృష్టించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు,ప్రత్యారోపణలు, వాగ్వాదాల నడుమ మూడు బిల్లులను మండలి ఆమోదించింది. పంచాయతీరాజ్ చట్టసవరణ, పురపాలక సంఘాల చట్టసవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. బిల్లులను ఆమోదించిన అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
……………………………………….