* పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం ఒక్కోలా మారిపోతుంది. అప్పటి వరకు వేడి గాలులు, ఎండవేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు సాయంత్రం కాగానే చల్లటి వాతావరణం ఉపశమనాన్ని ఇస్తోంది. అంతేకాకుండా ఉన్నట్టుండి వర్షాలు కూడా పడుతున్నాయి. ఉదయం ఎండగా ఉంటూ.. సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రజలకు ఊరట కలిగిస్తోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటనచేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తనున్నటు ్లపేర్కొంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఉదయం పూట ఎండలు దంచికొట్టినప్పటికీ సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలో విూటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ఈదురుగాలులతో కూడిన వర్షం పడనున్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. రాష్ట్రంలో ఖమ్మం, మహబూబాబాద్ నల్లగొండ, వరంగల్, జనగాం, సూర్యాపేట, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండగాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
……………………………………………
