
ఆకేరున్యూస్: జమ్మూకశ్మీర్ అవంతిపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతం చేశాయి. కాగా జమ్మూకశ్మీర్‌లో గడిచిన 48 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో భద్రతాబలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసి అటవీప్రాంతాల్లో అణువణువు జల్లెడపడుతున్నాయి. పహల్గాం నిందితులు, ఉగ్రవాదులను భద్రతాబలగాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ వేటలో భాగంగానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కొన్ని కొత్త ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పాకిస్థాన్ నుంచి వచ్చిన చొరబాటు ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. గురువారం టెర్రరిస్టుల కోసం గాలించగా నాదర్ , ట్రాల్ ప్రాంతాల్లో తారసపడడంతో భద్రతా బలగాలను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతాబలగాలు కూడా ప్రతిగా కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది మరణించినట్లు సమాచారం. మరో ముగ్గురు నలుగురు ఉగ్రవాదులు ఉండవచ్చని సమాచారం.
……………………………..