
* ఏపీలోని అన్నమయ్య జిల్లాలో బీభత్సం
ఆకేరు న్యూస్, అన్నమయ్య జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా(Annamayya District)లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడి(Elephants Attack)లో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతోంది. జిల్లాలోని ఓబులవారిపల్లె గుండాల కోన వద్ద ఈ ఘటన జరిగింది. శివరాత్రి సందర్భంగా ఆలయాలపై వెళ్తున్న భక్తులపై ఈ దాడి జరిగింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపం గుండాల కోనలోని శివాలయం స్థానికంగా చాలా ప్రసిద్ధి. యేటా ఇక్కడికి శివభక్తులు వస్తుంటారు. బుధవారం శివరాత్రి (Sivarathri)కావడంతో గుండాల కోన అటవీ ప్రాంతం గుండా 14 మంది శివ భక్తులు సోమవారం రాత్రి దర్శనానికి కాలి నడకన బయలుదేరి వెళ్లారు. అయితే మార్గం మధ్యలో ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. గుండాల కోన (Gundala kona)నుంచి తలకోన వెళుతుండగా ఏనుగులు దాడి చేశాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దాడి నుంచి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
………………………………….