
* కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ట్రాలీ అదుపుతప్పి ముగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మేడ్చల్ కు వస్తున్న ఆటో ట్రాలీ అదుపుతప్పి రెయిలింగ్ పై దూసుకెళ్లడంతో రింగ్ రోడ్డుపై భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న కూలీలపైకి దూసుకెళ్లింది. విశ్రాంతి తీసుకుంటున్న కూళీల్లో ముగ్గరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందనిపోలీసులు తెలిపారు. డ్రైవర్ గణేష్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ ఆంజనేయులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా మృతి చెందిన ముగ్గురు కూలీలు ఒడిషా రాష్ట్రానికి చెందిన నారాయణ ( 28) చెక్మోహన్ (24) జైరాం(32) గా గుర్తించారు. వలస కూలీలుగా వచ్చిన వీరు ఓఆర్ ఆర్ పై ఉన్న మొక్కలను కలుపుతీసే పనిలో ఉన్నారు. అప్పటి దాకా కలిసి పనిచేసి క్షణాల్లో తమ కళ్ల ముందు ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోవడాన్ని అక్కడున్న కూలీలు తట్టుకోలేక పోతున్నారు. కళ్ల మందు జరిగిన దారుణాన్ని చూసి భోరునవిలపిస్తున్నారు.
…………………………………