ఆకేరున్యూస్, ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకోగా.. ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. గరియాబాద్ జిల్లా ఇందగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సొర్నామల్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా, అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా, ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన సైనికులు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు వెల్లడిరచారు.
…………………………………………………