ఆకేరు న్యూస్, డెస్క్ : కాశీబుగ్గ ఘటనపై ప్రభుత్వం త్రీ సభ్య కమిటీని నియమించింది. టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, శ్రీకాకుళం ఏఎస్పీ కేవీ రమణ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ కమిటీలో ఉన్నారు. ఘటనకు దారి తీసిన కారణాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ జరిగిన పూర్తి దుర్ఘటనపై నివేదక ఇవ్వనుంది. తొక్కిసలాటలో 10 మంది మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనమైంది. 9 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఈ ప్రమాదంలో చనిపోయారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లోని స్వామివారి దర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. భక్తుల రద్దీ తో మెట్ల రెయిలింగ్ ఊడిపడింది. ఈ క్రమంలో భక్తులు ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట నెలకొంది.
………………………………………..
